News

ఆ ఫోటోలు కూడా తొలగించడం జరిగింది


ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పోటోను ఎపి శాసనసభ లాంజీలో పెట్టించాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం శాసనసభ కార్యదర్శి చాంబర్ లో ధర్నా చేసిన వీరు తాజాగా స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావును కలిసి విజ్ఞప్తి పత్రం అందచేశారు.వైఎస్ ఫోటోనే కాకుండా, మాజీ ముఖ్యమంత్రులు ప్రకాశం పంతులు, దామోదరం సంజీవయ్యల ఫోటోలు కూడా తొలగించడం జరిగిందని ,భవనం ఆధునీకరణకు ఫోటోలు తొలగించడం జరిగిందని స్పీకర్ సమాదానం ఇచ్చారు. ఏకపక్షంగా వైఎస్ పోటో తొలగించడం సరికాదని , గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుని పెట్టిన ఫోటోను తీసివేయడం సరికాదని వారు వాదించారు.